నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తోంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా
పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తోంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా
పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
Movie : Kotha Bangaru Lokam
Singer : S.P.Balasubrahmanyam
Music : Mickey J Meyer
Lyrics : Sirivennela Sitarama Sastry
Singer : S.P.Balasubrahmanyam
Music : Mickey J Meyer
Lyrics : Sirivennela Sitarama Sastry
Its a amazing lyrics by micky j mayer sir
ReplyDeleteLyric writter is Sitarama pastry Garu.
DeleteRey macha pastry emi ra
DeleteLyrics written by Sinare not by micky
Deleteసిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట రాసారు
DeleteAmazing lyrics
DeleteAmazing lyrics
DeleteFABULOUS LYRICS FROM SIRI VENNELA GARU@RAMP SINGING FROM SPB....BOTH ARE EXCELLENT 👌😀😀
Delete👌👌👌👌
ReplyDeleteThankfull to Balasubrahmanyam garu
ReplyDeleteWonderful singer
Thankfull to Balasubrahmanyam garu
ReplyDeleteWonderful singer
Balu Gaaru vacheyara malli
ReplyDeleteఇంత గొప్పపాట రాసినటువంటి సిరివెన్నెలగారికి, మరియు ఇంత గొప్పగా పాడినటువంటి ఎస్.పిబాలు గారికి నా ధన్యవాదములు.
ReplyDeleteThe lyrics have very beautiful meaning and the music just makes it perfect to listen to. Balu gari voice superb ��
ReplyDeleteబాలు గారు....నా ప్రాణం ఉన్నంత వరకు మీరు నాతోనే ఉంటారు
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGoppa artam unna paata rasina sitharama sastry gariki athyathbhuthanga padina baalu gaariki naa dhanyavaadamulu
ReplyDeleteSuper
ReplyDeleteExcellent
ReplyDeleteBalu sir I Miss you I love u sir
ReplyDeletesirivennela sir miss you sir
ReplyDeleteWonderful song
ReplyDeleteFab
ReplyDeleteSirvennala gaaru 🙏🙏
ReplyDeleteSuperb song sung by Balu garu legender of the eart surface
ReplyDeleteఈ పాట రాసిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి మరియు ఈ పాటను పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారికి నా ధన్యవాదాలు.
ReplyDeleteSuper lyrics
ReplyDeleteAmazing lyrics
ReplyDeleteSuper song
ReplyDeleteE movie lo prathi okka pata fantabulous Abba .
ReplyDeleteEnni sarlu vinna bore kottadu
Very good movie
With good message
Songs are awesome.....
It's time to read at all time
ReplyDeleteSong chala bagundhi
ReplyDeleteExcellent lyrics. సీతారామ శాస్త్రి గారు lives forever!
ReplyDelete