Naa Manusukemyindi Song Lyrics Nuvve Nuvve(2002)

నా మనసుకేమయింది నీ మాయలో పడింది..
నిజమా కలా తెలిసేదెలా..
నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది..
దాచేదెలా లోలోపలా..
మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది..
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది..
నా మనసుకేమయింది నీ మాయలో పడింది..
నిజమా కలా తెలిసేదెలా..

చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ..
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా..
జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ..
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ..
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి..
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి..
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని..
నా మనసుకేమయింది నీ మాయలో పడింది..
నిజమా కలా తెలిసేదెలా..

ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ..
ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ..
ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ..
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ..
లోకమంటే ఇద్దరే అదే మనం అని..
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని ..
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని...
నా మనసుకేమయింది నీ మాయలో పడింది..
నిజమా కలా తెలిసేదెలా..
మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది..
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది..

Movie   :  Nuvve Nuvve
Lyrics   :  Sirivennela
Music   :  Koti
Singer   :  Udit Narayana, Nithya Santoshini

Rooba Rooba Song Lyrics Orange(2010)

రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ..
తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..
అయ్యయ్యో .. ఏ మాయో నీ వెంట తరుముతోందే ..
ఉన్నట్టుండి .. నన్నేదో ఊపెస్తుందే ..
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే ..
రూబ రూబ రూ..ఊఊ..

రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ..
తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..
ఇంచి దూరమే అంటున్నా .. ఎలా వుండగలవు అంటుంది ..
నిన్ను తాకమని తొందర చేసే నా మదే ..
కొంటె చేతలే చేస్తున్నా .. తనేం చేసిన కాదనదే ..
ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే ..
ఓఒ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే ..
ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే ..
నీతో సాగే ఈ పయనం .. ఆగేనా ఇక ఏ నిమిషం
రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ..
తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..
రెక్కలోచ్చినట్టుంటుందే .. మదే తేలిపోతుంటుందే ..
రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే ..
నవ్వు నాకు తెగ నచ్చిందే .. నడుస్తున్న కళ నచ్చిందే ..
నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే..
ఓఒ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే ..
రోజూ నీ ఊసే కలల్నే పంచుతుందే ..
నీతో ఉంటె సంతోషం .. కాదా నిత్యం నా సొంతం ..
రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ..
తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..
అయ్యయ్యో .. ఏ మాయో నీ వెంట తరుముతోందే ..
ఉన్నట్టుండి .. నన్నేదో ఊపెస్తుందే ..
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే ..
రూబ రూబ రూ..ఊఊ..

Movie   :  Orange
Lyrics   :  Vanamali
Music   :  Haris Jayaraj
Singer  :  Shahil Hada, ChinmayiR

Niluvadhamu Ninu Epudaina Song Lyrics Nuvvostanante Nenoddantana (2005)

నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపెరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
|| నిలువద్దము||


ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు
నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు
|| నిలువద్ధము||

ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు
ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు
లేలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా
నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం
||నిలువద్ధం||

Movie   : Niluvadhamu Ninu Epudaina
Lyrics   : Sirivennela
Music   : Devi Sri Prasad
Singers: Karthik, Sumangali

Cheppave Chirugali Song Lyrics Okkadu (2003)

చెప్పవే చిరుగాలి... చల్లగా ఎదగిల్లి ||2||
ఎక్కడే వసంతాల కేళి.... చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ... ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి


ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే కీర్తికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే... హో... అడుగే అలై పొంగుతుంది
ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ....
చుట్టూ ఇంకా రేయున్నా... అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
రెక్కలు విప్పుకు ఎగిరిపోయే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే...
ఆపగలవ చీకట్లూ...
కురిసే సుగంధాల హోళీ... ఓ...
చూపదా వసంతాల కేళి ||కురిసే|| ||చెప్పవే||

యమునా తీరాల కధ వినిపించేలా రాధా మాధవులా జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళా... హో... చెవిలో సన్నాయి రాగంలా
ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ....
కలలే నిజమై అందేలా... ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఈదరి ఆదరి ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా...
పొద్దే పలకరించాలి...
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ... ఓ...
చూపదా వసంతాల కేళి ||ఉపిరే|| ||చెప్పవే||

Movie   :  Okkadu
Lyrics   :  Sirivennela
Music   :  Manisharma
Singers:  Udit Narayana, Sujatha

Chirugali Veechane Song Lyrics Shivaputrudu(2003)

చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే

కరుకైన గుండెలో..చిరుజల్లు కురిసెనే..
తనవారి పిలుపులో
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే..
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే..
చినుకు రాక చూసి మది చిందులేసెనే..
చిలిపితాళమేసి చెలరేగి పోయెనే..
చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే
చరణం : తుళ్ళుతున్న చిన్ని సెలయేరు
గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా
వెల్లువైనదీ లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే
నేలతల్లివంటి మనసల్లే
కొందరికే హౄదయముందీ
నీకొరకే లోకముందీ
నీకూ తోడు ఎవరంటు లేరూ గతములో
నేడు చెలిమికై చాపే,ఆరే బ్రతుకులో
కలిసిన బంధం , కరిగిపోదులే
మురళి మోవి,విరివి తావి కలిసిన వేళా
చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే
చరణం : మనసున వింత ఆకాశం
మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకు బెళుకా
ప్రతి మలుపూ ఎవరికెరుకా
విరిసిన ప్రతి పూదోటా
కోవెల ఒడి చేరేనా
ౠణమేదో మిగిలి ఉందీ
ఆ తపనే తరుముతోందీ
రోజూ ఊహలే ఊగే,రాగం గొంతులో
ఏవో పదములే పాడే,మోహం గుండెలో
ఏనాడూ తోడు లేకనే
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే
కరుకైన గుండెలో....చిరుజల్లు కురిసెనే
తనవారి పిలుపులో...
ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపితాళమేసి చెలరేగి పోయెనే...

Movie   :  Shivaputrudu
Lyrics   :  Vanamali
Music   :  Ilayaraja
Singer  :  R P Patnaik

Pranam Lo Prananga Song Lyrics Andhrudu (2005)

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..
మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా..
ఇలా ఇలా... నిరాశగా...
నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ..

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..
చరణం :స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే ...
కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే..
తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే..
ఎడారి లొ తుఫాను లొ
తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా...
ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..
చరణం :ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ..
మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే..
గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా,
స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ..
ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.


Movie   :  Andhrudu
Lyrics   :  Chandrabose
Music   :  Kalyani Malik
Signer  :  Chitra

Ekkadunnavamma O Priyathama Song Lyrics Okariki Okaru (2003)

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరంలాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో నా యదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచ్చుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి గురజాడ 
సుబ్బలక్ష్మి చెరుకూరి సుబ్బలక్ష్మి దగ్గుబాటి
సుబ్బలక్ష్మి పోసాని సుబ్బలక్ష్మి బెల్లంకొండ
సుబ్బలక్ష్మి సానా సుబ్బలక్ష్మి కోడూరి
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా

అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటే తెలుసు ఊరువాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు ఫోను నంబరేమిటో
అక్కడి చిలకను అడిగితే నువు సప్త సముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లీష్ చిలక నీ ఆచూకి తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోన
సుబ్బలక్ష్మి నండూరి
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
ఫస్టుటైము డైలు చేయగా అష్టలక్ష్మి పలికెరా
రెండోసారి రింగు చేయగా రాజ్యలక్ష్మి దొరికెరా
హోయ్.. మరోమారు ట్రైలు వేయగా మహాలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టెరా
ఎదురుదెబ్బలే తగిలినా నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టరునవుతాన్లే
కరి మబ్బులెన్ని నను కమ్మినా నా నెచ్చెలి నింగికి నిచ్చెన వేసి చేరువవుతాలే
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమా
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినేని సుబ్బలక్ష్మి మిద్దె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్టా
సుబ్బలక్ష్మి కైకాలా
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా

Movie   :  Okari Okaru
Lyrics   :  Chandrabose
Music   :  M M Keeravani
Singer  :  S P Balu

Jagamanta Kutumbam Song Lyrics Chakri(2005)

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
వింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై
వింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి
నా హృదయమె నా లోగిలి
నా హృదయమె నా పాటకి తల్లీ
నా హృదయమె నాకు ఆళి
నా హృదయములో ఇది సినీమావళి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

Movie   :  Chakram
Lyrics   :  Sirivennela
Music   :  Chakri
Singer  :  Sri Kommineni

Manmadhuda Nee Kalaganna Song Lyrics Manmadhaa(2005)

మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా
మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
నన్ను పారేసుకున్నాలే ఎప్పుడొ తెలియకా
నిన్ను కన్న తొలి నాడె దేహం కదలకా
ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే
ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు
ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు
మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా
మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా

మగువగా పుట్టినా జన్మ ఫలిత మీనాడు తెలిసే
మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే
ఎదలలోన ఊయలలూగే అందగాడు ఇతడంట
ఎదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట
ఐనా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా
ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో
ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో
మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రాణముగా మన్మధుడే నా ప్రణయమని మన్మధుడే నాకిష్టమని
చుక్క పొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో ఒక్క నీ ముద్దు మాత్రం సిగ్గు నేనవ్వనా
నా పడకటింటికీ నీ పేరే పెట్టనా
అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా
అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా

Movie   :  Manmadhaa
Lyrics   :  Veturi
Music   :  Yuvan Shankar Raja
Singe   :  Chitra

O Manasa O Manasa Song Lyrics Bhadra(2005)




ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం
వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం
కరిగే కలలే తరిమే మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

Movie  :  Bhadra
Lyrics  :  Sirivennela
Music  :  Devi Sri Prasad
Singer :  Ravi Varma

Every Body Song Lyrics Chukkalo Chandrudu (2005)

మళ్లీమళ్లీ రాదాంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండగా
యవ్వనం అంటేనే ఓ వరం
తప్పు ఒప్పు తేడాలే లేదురా
చిన్నమాటని చెవిన వేయనీ
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పనీ
బతుకుతూ బతికనిస్తే నువ్వు దేవుడే
everybody let's break this body
walk your body with me... ॥every॥
నాలాగే నేనుంటాను నా మది మాటే వింటుంటాను
this is the way i am
నాతోనే నేనుంటాను నచ్చిన పనినే చేస్తుంటాను
i don't give it down
నవ్వులు రువ్వుతూ నవ్వును పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా
చరణం :
అందని పండుని పొందాలి అంతా ఆన ందం
అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం
అల్లరి పనులే చేయాలి అపుడే ఆరోగ్యం
నా సాటి నేనుంటాను పోటీలోనే ముందుంటాను
కెరటం నాకే ఆదర్శం పడినా లేస్తాగా
సమరంకేఆహ్వానం గెలుపే నాదేగా
కష్టం అంటే ఇష్టంగా కష్టం రాదంటా
నమ్మిందే చేస్తుంటాను ప్రాణం పెట్టి సాధిస్తాను
everybody let's break this body
walk your body with me...
నవ్వులు రువ్వుతూ నవ్వును పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా
o my love i have been taken
that its all about giving
but life of me is just a part of living
so i was living livinglivinglivingliving
a mistake done i take in to step
taken into step start ahha
walk walk walk walk hey i just walk with love
i just won a have fun... thats right...
చిన్నమాటని చెవిన వేయనీ
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పనీ
బతుకుతూ బతికనిస్తే నువ్వు దేవుడే
everybody let's break this body
walk your body with me...
everybody let's break this body
walk your body with me...
ఆకాశం నీ సరిహద్దు అవకాశాన్ని అసలొదలొద్దు
this is the way i am
సందేహం ఏదీ లేదు పోయేటప్పుడు ఏదీ రాదు
స్వేచ్ఛగా మంచిని పంచుతూ నాలుగు రోజులు ఉన్నా చాలు జన్మ ధన్యమే...

Movie   :  Chukkalo Chandrudu
Lyrics   :  Bhaskara Bhatla
Music   :  Chakri
Singers:  Shaan, Siddharth

Palike Gorinka Song Lyrics Priyuralu Pilichindi (2000)

పలికే గోరింకా చూడవె నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్ట నమ్మేది
నే నాటితె రోజా నేడే పూయులే
పలికే గోరింకా చూడవె నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

పగలే ఇక వెన్నెలా
పగలే ఇక వెన్నెలా వస్తే పాపమ
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూర కలలను చూచినచో ఆరు కలలైన ఫలియించు
కలలే దరీచేరవా
పలికే గోరింకా చూడవె నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
నా పేరే పాటగా కోయిలే పాడని
నే కోరినట్టుగా పరువం మారని
భరతమ్ తమ్ తమ్ మదిలో తమ్ తోమ్ ధిమ్
భరతమ్ తమ్ తమ్ మదిలో తమ్ తోమ్ ధిమ్
రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు
బ్రతుకే బతికేన్దుకు
పలికే గోరింకా చూడవె నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్ట నమ్మేది
నే నాటితె రోజా నేడే పూయులే

Movie   :  Priyuralu Pilichindi
Lyrics   :  Siva Ganesh, A M Rathnam
Music   :  A R Rahman
Singer  :  Sadhana Sargam

Feel My Love Song Lyrics Arya(2004)

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గాథో
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్
నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదనీ
నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే
ఫీల్ మై లవ్....ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
ఎరుపెక్కీ చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటీ తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్
విదిలించీ కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెలుతూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆపైనా ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే
ఫీల్ మై లవ్....ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్


Movie   :  Arya
Lyrics   :  Chandrabose
Music   :  Devi Sri Prasad
Singer  :  K.K

Jatha Kalise Jatha Kalise Song Lyrics Srimanthudu(2015)

జత కలిసే జత కలిసే
జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే
జనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ

నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపు లోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటుఏమో ఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరు
ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ

Movie   :  Srimanthudu
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Devi Sri Prasad
Singers:  Suchitra Karthik Kumar, Sagar

Evvaru Emanna Maradhu Song Lyrics Jayam(2002)

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ

కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది
ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమ పుడుతుంది
గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా
గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా
ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ
ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట
కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరుగా
కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా
ప్రేమకెపుడైనా జయమే కానీ ఓటమి లేదంట
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ
శాశ్వతమీ ప్రేమ...

Movie   :  Jayam
Lyrics   :  Kulasekhar
Music   :  R P Patnaik
Singers:  R P Patnaik, Usha

Chudandi Saaru Song Lyrics Raghuvaran Btech(2014)

చూడండి సారు మన సూపర్ స్టారు
కుమ్మేస్తున్నారు వన్ సైడు ప్యారు
ఎర్రబస్సే ఎగురునా ఐఫిల్ టవరే వొంగునా
రైల్వే ట్రాకుపై ఏరోప్లేన్ తిరుగునా

అయ్యో చూడండి సారు మన సూపర్ స్టారు
వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు
టెడ్డీ బేర్ పలుకునా బార్బీ డాల్ పాడునా
రైన్ బో రంగుల్లో బ్లాక్ కలర్ దొరుకునా
ఆహా చూడండి సారు మన సూపర్ స్టారు
దుమ్ము లేపేస్తన్నారు లౌ మేగె్నటిక్ పవరు
గూగుల్ గాల్లో కలిసినా ఫేస్ బుక్ షట్టర్ మూసినా
అరెరే రఘువరా నీ లవ్వే గెలుచునా
సిమ్ము కార్డే లేనిదే సెల్లు ఫోన్ మోగునా
బీబీసీ ఛానెలు చిత్రహార్ చూపునా
సండే రోజున గుడ్ ఫ్రైడే వచ్చునా
అరెరే రఘువరా నీ లవ్వే గెలుచునా

Movie   :  Raghuvaran Btech
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Anirudh Ravichander
Singer  :  Hema Chandra

Udyogam Oodipoyindi Song Lyrics Maryada Ramanna(2010)

ఉద్యోగం ఊడిపోయింది..
పోయిందా...పొ పొ పొ పోయిందా..
సద్యోగం సంతకెళ్ళింది
గోవిందా.. గొ గొ గొ గోవిందా..
గోదారి ఈదాలంటే.. కుక్కతోకైనా లేదండీ..
ఏ దేవుడి నడగాలన్నా.. హుండికి చిల్లర లేదు..
పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..

ఎవడండీ బాబూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు..?
కృషి ఉంది.. దుర్భిక్షం కూడా ఉంది..!!
చెమటోడ్చే మనుషులకి ఏలోటూ రానే రాదంటారు..?
ఏమైందీ.. ఆ చెమటేగా మిగిలింది..!
ఛీ అంది.. చేతిలో గీత
నలిగింది.. నుదిటిపై రాత..
టోటల్ గా చీకటయ్యిందీ లైఫంతా..
పెదవి ఎండిపోయింది..
పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..
శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను..
పనిలేదు.. పాకెట్లో పైసాలేదు..
దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను..
ఏం చేయను.. నే ఐరెన్ లెగ్గయ్యాను..
భిచ్చమెత్తరా..! (సిగ్గుపడతాను)
జేబు కత్తెర..! (వెయ్యనే లేను)
చచ్చిపోమరి.. అంతపని చచ్చినా బాబోయ్ నే చేయలేను...
లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది..
తిక్క తీరిపోయింది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.

Movie   :  Maryada Ramanna
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Keeravani
Singer  :  Ranjith

Badulu Tochani Song Lyrics Mr. Perfect (2011)

ఎప్పటికీ తన గుప్పెట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడడం తనకేం సరదా
పల్లవి:
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్న మొనా్న నీ లోపలా కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తయినా అనిపించిందారా
॥ఎప్పటికీ॥


ఏదోలా చూస్తారే నిన్ను వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా
మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూవుంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా
సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా
॥బదులు॥


నీ తీరే మారింది నిన్నకీ నేటికీ
నీ దారే మళ్లుతోందా కొత్త తీరానికి
మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించక ముందే
ఎవరెవరో చెబుతూవుంటే నమ్మేదెలా
వెళ్లే మార్గం ముళ్లుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీళ్లేదెలా

Movie   :  Mr.Perfect
Lyrics   :  Sirivennela
Music   :  Devi Sri Prasad
Singers:  Mallikarjun, Karthik

Paravaledhu Paravaledhu Song Lyrics Manasara(2010)

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వు ఎవరైనా పర్లేదు
ఓ.. నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు
ఎందుకీ దాగుడుమూతలు అర్దమే లేదు
మంచేదో ఉన్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ అయినా మరి పర్లేదు
మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని
తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని
అందంగా లేను అని నిన్నెవరూ చూడరని
నువ్వెవరికీ నచ్చవని నీకెవ్వరు చెప్పారు
ఎంత మంచి మనసో నీది దాని కన్నా గొప్పది లేదు
అందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు
కోరమీసం లేకున్నా గాని మరీ పర్లేదు
పరదాలే ఎన్నాళ్ళిలా అని నిన్నే అడగమని
సరదాగా తరిమింది మది నీపై మనసుపడి
మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకొని
అది నువ్వో కాదో అని సందేహం ప్రతీసారి
చేరదీసి లాలించలేదు నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదు
ఎవరేమన్నా సరే నా చెయ్యి నిన్నింక వదిలేదు లేదు
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వు ఎవరైనా పర్లేదు

Movie   :  Manasara
Lyrics   :  Bhaskara Bhatla, Anantha Sriram
Music   :  Shekar Chandra
Singer  :  Geetha Madhuri

Choododdhe Nannu Song Lyrics Aaru(2005)

చూడొద్దే నను చూడొద్దే
చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే
మది గూడు దాటి వదిలెళ్ళోద్దే
అపుడు పంచిన నీ మనసే
ఆపని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో
ఇమ్మని అడగొద్దే..

చూడొద్దే నను చూడొద్దే
చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే
మది గూడు దాటి వదిలెళ్ళోద్దే
వద్దు వద్దు అంటు నేనున్నా
వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటూ నేనున్నా
పొగలా అల్లింది నువ్వేగా
నిదరొస్తున్న హృదయాన్ని
లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి
రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ
నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రణమా
నువ్వు అయి నిలిచావే
చూడొద్దే నను చూడొద్దే
చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే
మది గూడు దాటి వదిలెళ్ళోద్దే
హా హా..
వద్దు వద్దంటు నువ్వున్నా
వలపే పుట్టింది నీ పైనా
కాదు కాదంటు నువ్వున్నా
కడలే పొంగింది నాలోన
కన్నేల తీరంలో
పడవల్లే నిలుచున్నా
సుడిగుండాల శృతిలయలో
పిలుపే ఇస్తున్నా..
మంటలు తగిలిన పుత్తడిలో
మెరుపే కలుగునులే
ఒంటిగా తిరిగిన ఇద్దరిలో
ప్రేమే పెరుగునులే
చూడొద్దే నను చూడొద్దే
చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే
మది గూడు దాటి వదిలెళ్ళోద్దే
అపుడు పంచిన నా మనసే
అప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలిఊసే
ఇప్పుడు నీదేలే..

Movie   :  Aaru
Lyrics   :  Chandrabose
Music   :  Devi Sri Prasad
Singers:  Tippu, Sumangali

Bugge Bangarama Song Lyrics Chandamama(2007)

పచ్చి పాల యవ్వనాలా గువ్వలాట
పంచుకుంటే రాతి రంతా జాతరంట
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మ
పట్టు చీరల్లొ చందమామ
ఏడు వన్నెల్లో వెనేలమ్మ
కన్నె రూపాల కోనసీమ
కోటి తారల్లో ముద్దు గుమ్మ
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
ఒళ్ళె వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ

ఎదురే నిలిచే అధర మధుర దరహాసమ్
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధు మాసం
వెలిగే అందం చెలికే సొంతం వసంతం
వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలొ జరిగ్ విహారం
పుశ్య మాసాన మంచు నీవో
భోగి మంటల్లో వేడి నీవో
పూల గందాల గాలి నీవో
పాల నురగల్లో తీపి నీవో
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే ఆజేసేలేమ్మా
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందె గాలి కొట్టగానే ఆరు బయట ఎన్నెలంతా
సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..యో
నారు మల్లె తోటకాడ నాయుడోరి ఎంకిపాట
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందె గాలి కొట్టగానే ఆరు బయట ఎన్నెలంతా
సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..
ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడమ్ జరిగే సరసం ఎపుడో
అన్ని పువుల్లో ఆమె నవ్వే
అన్ని రంగుల్లో ఆమె రూపే
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే
నన్ను మొత్తంగా మాయ చేసె
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ
పట్టు చీరల్లో చందమామ
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ
కన్నె రూపాల కోనసీమ
కోటి తారల్లో ముద్దు గుమ్మ

Movie   :  Chandamama
Lyrics   :  Peddada Murthy
Music   :  K M Radha Krishnan
Singer  :  Rajesh Krishnan

Cheliya Cheliya Song Lyrics Idiot(2002)

చెలియా చెలియా తెలుసా
కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే
సఖియా మనసే అలుసా
కలిసే దారే కరువై కనులానీరే నదులై
ప్రియురాలా కనవా నా ఆవేదనా
ప్రియురాలా వినవా ఈ ఆలాపన
వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా ||చెలియా||
చ:౧ఎదలో ఒదిగే ఎదనే
ఎదుటే దాచిందెవరు
ఆశై ఎగిసే అలనే
మాయం చేసిందెవరు
వినపడుతున్నది నామదికి
చెలి జిలిజిలి పలుకుల గుసగుసలు
కనబడుతున్నవి కన్నులకీ
నినమొన్నల మెరిసిన ప్రియలయలు
ఇరువురి ఎదసడి ముగిసినదా
కలవరముల చెర బిగిసినదా
చెలియా చెలియా దరిరావా
సఖియా సఖియా జత కావా
ఓ....ఓ.... రెప్పల మాటున
ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ ||చెలియా||
గతమే చెరిపేదెవరు
దిగులే ఆపేదెవరు
కబురే తెలిపేదెవరు వలపే
జననం ఒకటే తెలుసుమరి
తన మరణం అన్నది ఎరుగదది
కాదని కత్తులు దూస్తున్నా
మమకారం మాత్రం మరువదది
చరితలు తెలిపిన సత్యమిదే
అంతిమ విజయం ప్రేమలదే
చెలియా చెలియా విడువకుమా
గెలిచేదొకటే ప్రేమ సుమా
ఓ...ఓ... గుండెల గుడిలో
ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ ||చెలియా||


Movie   : Idiot
Lyrics   : Peddada Murthy
Music   : Chakri
Singer  : Ravi Varma

Cheliya Sakhiya Song Lyrics Sakhi(2000)

సఖియా... చెలియా...
కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు..
సఖియా... చెలియా...
నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు..
పచ్చందనమే పచ్చదనమే..
తొలి తొలి వలపే పచ్చదనమే..
పచ్చిక నవ్వుల పచ్చదనమే..
ఎదకు సమ్మతం చెలిమే...
ఎదకు సమ్మతం చెలిమే...

పచ్చందనమే పచ్చదనమే..
ఎదిగే పరువం పచ్చదనమే..
నీ చిరునవ్వు పచ్చదనమే..
ఎదకు సమ్మతం చెలిమే..
ఎదకు సమ్మతం చెలిమే...
ఎదకు సమ్మతం చెలిమే...

కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు..
ఎర్రముక్కులే పిల్ల వాక్కు ..
పువ్వై పూసిన ఎర్ర రోజా..
పూత గులాబి పసి పాదం..
ఎర్రని రూపం ఉడికే కోపం..
ఎర్రని రూపం ఉడికే కోపం..
సంధ్యావర్ణ మంత్రాలు వింటే..
ఎర్రని పంట పాదమంటే..
కాంచనాల జిలుగు పచ్చ..
కొండబంతి గోరంత పచ్చ..
పచ్చా... పచ్చా... పచ్చా...
మసకే పడితే మరకత వర్ణం..
అందం చందం అలిగిన వర్ణం..

సఖియా... చెలియా...
కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు..
సఖియా... చెలియా...
నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు..

అలలే లేని సాగర వర్ణం..
మొయిలే లేని అంబర వర్ణం..
మయూర గళమే వర్ణం..
గుమ్మాడి పూవు తొలి వర్ణం..
ఊదా పూరెక్కలపై వర్ణం..
ఎన్నో చేరేని కన్నె గగనం..
నన్నే చేరే ఈ కన్నె భువనం..

రాత్రి నలుపే రంగు నలుపే..
వానాకాలం మొత్తం నలుపే..
కాకి రెక్కల్లో కారునలుపే..
కన్నె కాటుక కళ్లు నలుపే..
విసిగి పాడే కోయిల నలుపే..
నీలాంబరాల కుంతల నలుపే..
నీలాంబరాల కుంతల నలుపే..

సఖియా... చెలియా...
కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు..
సఖియా... చెలియా...
నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు..

తెల్లని తెలుపే ఎద తెలిపే..
వానలు కడిగిన తుమి తెలుపే..
తెల్లని తెలుపే ఎద తెలిపే..
వానలు కడిగిన తుమి తెలుపే..
ఇరు కనుపాపల కథ తెలిపే..
ఉన్న మనసు తెలిపే..
ఉడుకు మనసు తెలిపే..
ఉరుకు మనసు తెలిపే..


Movie   :  Sakhi
Lyrics   :  Veturi
Music   :  A R Rahman
Singers :  Hari Haran, Clinton Cerejo

Nuvvunte Naa Jathaga Song Lyrics I (Manoharudu) (2015)

వీచే చిరుగాలిని వెలివేస్తా..
హో పారే నదినావిరి చేస్తా.. 
నేనున్న నేలంతా మాయం చేస్తా... 
లేనే లేదే అవసరమే..
నువ్వే నాకు ప్రియవరమే..

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..ఊపిరిగా..ఊపిరిగా..
నువ్వుంటే నా జతగా..నా జతగా..
నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా..నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..

నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ..
ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ..
నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా..
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా..
నువ్వుంటే నా జతగా...

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా..
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా..
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా..
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా..
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా..
పువ్వుల్లోని తేనె పురుగులకందునా..
మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా..
బూచినే చూసిన పాపనై బెదిరా..

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ...
నేనుంటా ఊపిరిగా..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ..
నువ్ లేని లోకంలో నే బ్రతక లేనే ..
నువ్వుంటే నా జతగా...

Movie   :  I(Manoharudu)
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  A R Rahaman
Singers :  Sid Sriram, Isshrathquadhre

Motta Modatisari Song Lyrics Bhale Bhale Mogadivoi(2015)

స స ప మ ప స స..
స స ప మ ప స స..
ప ప ని ని ప మ గ మ ప మ..

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ..
ఎదురయ్యింది చందమామా..
హేల... చారడేసి కళ్ళా...
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా... 
ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా..
నా స్వాశనాపే బంగారు బాణాలా... 

స స ప మ ప స స..
స స ప మ ప స స..
ప ప ని ని ప మ గ మ ప మ..
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ..
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
మధు మంత్రం చవి చూస్తున్నా..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
మర యంత్రం ఐపోతున్నా..
అడుగే నన్ను వద్దన్నా పరుగే ఇక ఆగేనా..
ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా...
నాలో ప్రేమనూ నీ కానుకివ్వగా..
అర చేతులందు మొలిచెను పూవనం..
నీ వల్లనే చెలీ..నా గుండే లోతుల్లో..
ఓ పాలపుంత పేలిన సంబరం...

స స ప మ ప స స..
స స ప మ ప స స..
ప ప ని ని ప మ గ మ ప మ..
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ..
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
కనురెప్పల దోచెలి చాచా..
ఓ.. ఓ.. ఓ.. ఓ...
కలలోకి నిన్నే పిలిచా..
తొలి చూపున ప్రేమించా..
మలి చూపున మనసిచ్చా..
నిదురకి ఇక సెలవిచ్చా..
నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై..
నను పదమందే నీ నీడగా..
నా జత సగమై రేపటి వరమై..
నువ్వూంటావా నా తోడుగా..

హేల... చారడేసి కళ్ళా...
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా... 
ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా..
నా స్వాశనాపే బంగారు బాణాలా... 
స స ప మ ప స స..
స స ప మ ప స స..
ప ప ని ని ప మ గ మ ప మ..
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ..
ఎదురయ్యింది చందమామా..

Movie   :  Bhale Bhale Mogadivoi
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Gopi Sunder
Singer  :  Sachin Warrier