O My Friend Song Lyrics Happy Days(2007)

పాదమెటు పోతున్నా పయనమెందాకైనా

అడుగు తడబడుతున్నా తోడురానా

చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా

గుండె ప్రతి లయలోన నేను లేనా

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడవేనా

Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా


అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది

జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది

మీరు మీరు నించి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే

మోమటాలే లేని కళే జాలువారే

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడనీవే

Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా


వానవస్తే కాగితాలే పడవలయ్యే ఙాపకాలే

నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే

గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూతుళ్ళింతల్లో తేలే స్నేహం

మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడనీదే

Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా


Movie    :  Happy Days
Lyrics    :  Vanamali
Music    :  Mickey J Meyer
Singer   :  Karthik

Nalugurikee Nachinadi Song Lyrics Takkari Donga(2002)

నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో
నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో
నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
పొగరని అందరు అన్నా అది మాత్రం నానయిజం
తెగువని కొందరు అన్నా అది నాలో మానరిజం
నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ
నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ

నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ
నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ

నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో
నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
నువ్వు నిలబడీ నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్
పరుగులెత్తూ పాలు తాగడం సంథింగ్ స్పెషల్
నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్
అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్
లేని వాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్
లేని వాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్
ఉన్నవాడిదీ దోచుకెళ్ళడం సంథింగ్ స్పెషల్
నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో
నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
బుద్ధిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్ స్పెషల్
పోకిరోడిల పేరు కెక్కడం సంథింగ్ స్పెషల్

రాజమార్గమున ముందుకెళ్ళడం నథింగ్ స్పెషల్
దొడ్డిదారిలో దూసుకెళ్ళడం సంథింగ్ స్పెషల్
హాయి కలిగిదితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్
హాయి కలిగిదితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్
బాధ కలిగినా నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్

నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో
నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
పొగరని అందరు అన్నా అది మాత్రం నానయిజం
తెగువని కొందరు అన్నా అది నాలో మానరిజం
నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ
నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ
నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ
నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ


Movie   :  Takkari Donga
Lyrics   :  Chandrabose
Music   :  Manisharma
Singer  :  Shankar Mahadevan


Aakasam Dhigi Vachi Song Lyrics Nuvvu Naaku Nachav(2001)

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి 
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి 
చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం 
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం 
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే 

చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో 
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా 
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా 

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు 
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు 
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా 



Movie   :  Nuvvu Naaku Nachav
Lyrics   :  Sirivennela
Music   :  Koti
Singer  :  S P Balu

Annayya Annavante Song Lyrics(2006)

అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదురవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
...
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు
...
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
...
చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి
పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి
రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి
రాముడింట ప్రేమలు పంచాలి ఆ సీత లాగ పేరుకు రావాలి
నీలాంటి అన్నగాని ఉండి ఉంటే తోడూ నీడా
ఆనాటి సీతకన్ని కష్టాలంటూ కలిగుండేవా
...
చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా
చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
...
కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే
కన్నుల్లోని నీరే నేనమ్మా
నన్ను నీవు జారినీకమ్మా
ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే
తులసి చెట్టు కోటని నేనమ్మా నీ కాపలాగ మారనివ్వమ్మా
ముక్కోటి దేవతల అందరి వరం అన్నవరం
ఇలాంటి అన్న తోడు అందరికుంటే భూమే స్వర్గం
...
చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా
చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
...
అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదురవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
...
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు
...
చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా
చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా

Movie   :  Annavaram
Lyrics   :  Chandrabose
Music   :  Ramana Gogula
Singers :  Mano, Ganga

Pedave Palikina Song Lyrics Nani(2004)

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మా
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి ఆమ్మగా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగ కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్లో ఒదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్లు సాకనా చల్లగ చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసి కూనా ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఓ పసి కూనా ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో 

Movie   :  Nani
Lyrics   :  Chandrabose
Music   :  A R Rahman
Singers:  Unni Krishnan, Sadhana Sargam

Lokale Gelavaga Nilichina Song Lyrics(2005)

లోకలే గెలవగా నీలీచీన
స్నేహాల వీలూవాలూ తెలీసేన
ఈ ప్రేమ సరీగమ నూవ్వేగా
కాలాన్నే కదలక నీలీపీన
ఆకాశం భూమీనీ కలీపీన
ఏదైనా వెనకన నూవ్వేగా
ఎన్నెన్నో వరమూలూ కూరీసీన గుండెల్లో వలపే ఎగసిన ఈ ఆనందం నీ చీరూనవ్వేగా

నీతోనే కలీసీన క్షనమూన నీలోనీ అనూవనూవనూవూన నీవే నీవే నీవే నీవూగా
లోకలే గెలవగా నీలీచీన
స్నేహాల వీలూవాలూ తెలీసేన
ఈ ప్రేమ సరీగమ నూవ్వేగా



ఈ పువ్వు కోరిందిరా ప్రేమభిషేకాలని
నా చూపూ పంపింది లే పన్నీటీ మేఘాలనే
బూగ్గపై చీరు చూక్కవై జూట్టూవై సీరీబోట్టూవై నాతోనే నువ్వుండిపో
ఊపీవై యద చీలీపీనై ఊపూనై కనూచూపూనై నీలోనే నేనుంటినే
నీ రామ చీలకనో నేనై న రామచంద్రూడూ నీవై
కలీసే ఊంటే అంతే చాలురా.
లోకలే గెలవగా నీలీచీన
స్నేహాల వీలూవాలూ తెలీసేన
ఈ ప్రేమ సరీగమ నూవ్వేగా
కాలాన్నే కదలక నీలీపీన
ఆకాశం భూమీనీ కలీపీన
ఏదైనా వెనకన నూవ్వేగా



ఈ రాధా బృందావనం సుస్వాగతం అంది రా..
నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే
పక్కగా రారంమనీ కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్ళు కోరలిరా
ఎప్పూడూ కనూరేప్పల చప్పూడై యదలోపల ఉంటూనే ఉన్నానుగా
సన్నాయీ స్వరమూల మదూరీమ పూన్నగా పూవ్వూల ఘూమ ఘూమ
అన్నీ నీవై నన్నే చేరరా
లోకలే గెలవగా నీలీచీన
స్నేహాల వీలూవాలూ తెలీసేన
ఈ ప్రేమ సరీగమ నూవ్వేగా
కాలాన్నే కదలక నీలీపీన
ఆకాశం భూమీనీ కలీపీన
ఏదైనా వెనకన నూవ్వేగా


Movie   :  Balu
Lyrics   :  Jonnavithula
Music   :  Manisharma
Singers:  Murali, Chitra

Em Cheppanu Ela Cheppanu Song Lyrics Nenu Sailaja(2016)

ఎం చెప్పను నిన్నెలా ఆపాను...
ఓ ప్రాణమా నిన్నెలా వదలను
ఏ ప్రశ్నను ఎవరినేం అడగను...
ఓ మౌనమా నిన్నెలా దాటను,
పెదాల పైన నవ్వు పూత పుసుకున్న నేనే
కన్నీటితో ఈవేళా దాన్నెలా చేరపను ...
తన జ్ఞాపకమైన తగదని మనసునేలా...మార్చాను
ఈ ప్రేమకి ఏమిటి వేడుకా ...
ఎ జన్మకి జంటగా ఉండక...

ఎం చెప్పను నిన్నెలా ఆపాను...
ఓ ప్రాణమా నిన్నెలా వదలను.
ఇదివరకలవాటు లేనిది,
మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనుక చేయి జారుతుంటే ఎం తోచకున్నది
ఊరించిన నిలిమబ్బుని, ఉహించని గాలి తాకిడి
ఎటువైపో తరుముతుంటే కళ్ళారా చూస్తూ ఎల్లా మరి
ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని
తడారుతున్న గుండెలోకి రా ..రమ్మని
తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఉపిరి
ఈ ప్రేమకి ఏమిటి వేడుకా ...
ఎ జన్మకి జంటగా ఉండక..
నా మనసున చోటు చిన్నది,
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుభందమై అది
నువ్విచ్చిన సంపదే ఇది,
నా చుట్టూ అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది
సుదుర..మైన ఆశలెన్నో చేరువవుతు ఉన్నా
అవందుకోనూ...నిన్ను వీడి నే వెళ్ళనా...
పొందేది ఎదో పోతున్నదేదో తెల్చేదేవ్వరు..
ఈ ప్రేమకి ఏమిటి వేడుకా ...
ఎ జన్మకి జంటగా ఉండక...

Movie   :  Nenu Sailaja
Lyrics   :  Sirivennela
Music   :  Devi Sri Prasad
Singers:  Karthik, Chitra

Merise Merise Song Lyrics Pelli Choopulu(2016)

మెరిసే మెరిసే మనసే మురిసే నీల
చెలిమే వలనే
చిరు చిరు అసలు వీరిసేగా

కడలే యాదలో మునకేసెనా
తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..
ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఏయేఏ అలరారే అలా ఏగిసే
తానే తననే చేరి
హృదయం లోలోనా పరిచెయ్
ఎన్నో వెళుతురులే
మిణుగూరులై ముసిరి ఎదా నిమిరె
కడలే యాదలో మునకేసెనా
చిగురులు తొడిగే లతలే అన్ని
సీతాకోక లాయె
తళతలలడే చుక్కలనే తాకే
నీలకశం చుట్టురా తిరిగేస్తూ
ఎంతశ్చర్యం జాబిల్‌కే
నడకలు నేర్పిoచే
ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఏయేఏ అలరారే అలా ఏగిసే
తనాఏ తననే చేరి
కసూరుతూ కదిలే కాలం
ఏమైపోనట్టు….
కోసారి కోసారి పలకరించు
జల్లులీల ఇన్నల్ళేమైనట్టు
గగానం నయనం తెరువంగా
మురిసే భువనామిల
ఒకటై నడిచే అడుగులిక
నిలవాలి కలకలం
మెరిసే మెరిసే మనసే మురిసే నీల
చెలిమే వలనే
చిరు చిరు అసలు వీరిసేగా
తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..
ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఏయేఏ అలరారే అలా ఏగిసే
తానే తననే చేరి
హృదయం లోలోనా పరిచెయ్
ఎన్నో వెళుతురులే
మిణుగూరులై ముసిరి ఎద నిమిరె

Movie   :  Pelli Choopulu
Lyrics   :  Shreshta
Music   :  Vivek Sagar
Singers:  Haricharan, Pranavi Acharya

Bham Bham Bole Song Lyrics Indra(2002)

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే

దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ..
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...
భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్
భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్
భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం
ఢమరూభాజే ఢమరూభాజే ఢమరూభాజే ఢంఢమాఢం
భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం
వారణాసిని వర్ణించే నా గీతికా
నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణికా
అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక
నమక చమకాలై ఎద లయలే కీర్తన చేయగా
యమక గమకాలై పద గతులే నర్తన చేయగా
ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా.. ఆ.. ఆ
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ
కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే
మన కష్టమే తొలగిపోదా
ఏ... దందమాదం దం
దమాదం దమాదం
దందమాదం దం
దమాదం దమాదం
దందమాదం దం దందమాదం దం దందమాదం దం
దమాదందం దం దం దం
ఎదురయే శిల ఏదైన శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే..
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిది ఈ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి కాశి మహిమా
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

Movie   :  Indra
Lyrics   :  Sirivennela
Music   :  Manisharma
Singers:  Hari Haran, Shankar Mahadevan

Chali Gaali Chudduu Song Lyrics Gentlemen(2016)

చలి గాలి చూద్దు తెగ తుంటరి ..
గిలిగింతపెడుతున్నది..
పొగ మంచు చూద్దు మహ మంచిది ..
తెరచాటుకడుతున్నది..
నన నన్నాన నన్నాన కథ ఏమిటి.. 
నన నన్నాన నన్నాన తెలుసా మరి..
ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి..
అది నీకైన నాకైన తెలుసా మరి..
అయినా వయసిక ఆగేనా ..
మనమిక మోమట పడకూడదంటున్నది..

చలి గాలి చూద్దు తెగ తుంటరి ..
గిలిగింతపెడుతున్నది..
పొగ మంచు చూద్దు మహ మంచిది ..
తెరచాటుకడుతున్నది..

ఎటుపోతున్నాం అని అడిగామా..
ఎదురుగ వచ్చే దారేదైనా..
ఏమైపోతాం అనుకున్నామ..
జత పరుగుల్లో ఏం జరిగినా...
శ్రుతి మించె సరాగం ఏమన్నది.. 
మనమిక మోమాట పడకూడదంటున్నది..

చలి గాలి చూద్దు తెగ తుంటరి ..
గిలిగింతపెడుతున్నది..
పొగ మంచు చూద్దు మహ మంచిది ..
తెరచాటుకడుతున్నది..

కలతేఐన కిలకిలమనదా..
మన నవ్వుల్లో తానుచేరి..
నడిరేయైనా విలవిలమనదా..
నిలువున నిమిరి..ఈడావిరి..
మతిపోయెంత మైకం ఏమన్నది..
మనమిక మోమాట పడకూడదంటున్నది..

పొగ మంచు చూద్దు మహ మంచిది ..
తెరచాటుకడుతున్నది..
చలి గాలి చూద్దు తెగ తుంటరి ..
గిలిగింతపెడుతున్నది...


Movie    :  Gentlemen
Lyrics    :  Sirivennela
Music    :  Manisharma
Singers :  Haricharan, Padmalatha, Malavika