Chandrulo Unde Song Lyrics Nuvvostanante Nenoddantana(2005)

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట
నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా

గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో

కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం బాటచూపగా
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా లేని పోని దుందురుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవా

Movie   :  Nuvvostanante Nenoddantana
Lyrics   :  Sirivennela
Music   :  Devi Sri Prasad
Singers :  Shankar Mahadevan, Devi Sri Prasad

1 comment:

  1. ముఖ పుస్తకం మిత్రులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.
    ఈ రోజు రిలీజ్ అయిన #నా_ప్రాణం_నువ్వే షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయాల్ని తెలుపండి.
    మీకు నచ్హితే షేర్ చేయండి. మా ఛానల్ ని subscirbe చసుకోండి.
    ధన్యవాదాలు....!

    https://theluckeywebsite.blogspot.com/2020/08/naa-pranam-nuvve-musically-short-movie.html

    ReplyDelete