Aeivennele Sona Song Lyrics Cheli(2001)

హే వెన్నెల సోనా నిను చేరగా రానా
నీ సొగసే కవితై కీర్తనలే నే పాడే వేళ
ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసెయ్‌నా
హే వెన్నెల సోనా నిను చేరగా రానా
నీ సొగసే కవితై కీర్తనలే నే పాడే వేళ
ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసెయ్‌నా
స్త్రీలంటే నీకొక అలర్జీ కాదా
ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కాదా
నన్ను ఏదో చేసేసిందంట
Come on baby, Don't do this baby
లవ్లీ బాణం కొట్టేసిందంట
లవ్లీగా నన్ను పట్టేసిందంట
నిదరే నే మరిచా వ్యథతో నిన్నే తలిచా
చవితి వెన్నెల్తో కబురెట్టి రమ్మంటే
తగదు అన్నావు ఇది న్యాయమా
ఇది రెచ్చిపోయె అరె నేస్తం
ఎదలోన సాగె ఒక యుద్ధం
అరె దాగె దారిలో సమ్మర్ మాదిరి
మండుతున్నదే హృదయం
బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైనా ఇల్లా
ఓ ఇంద్ర నీలమా ఇంత జాలమా
అలక మానుమా ముంబాయ్ బొమ్మా
హే హే హే వెన్నెల సోనా నిను చేరగా రానా
నీ సొగసే కవితై కీర్తనలే నే పాడే వేళ
ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసెయ్‌నా
Never do this to me...
don't ever do this to me bAby
నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా
నీ చిన్ని గుండెలోన నా ప్రాణం దాగేనమ్మా
నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా
నీ చిన్ని గుండెలోన నా ప్రాణం దాగేనమ్మా
నువ్వంటే నాకు ప్రాణం నేనుందే నీ కోసం
ఎదట నిల్చున్నా ఏమేమి చేస్తున్నా
నా అంతరంగాన నీవే కదా
లవ్‌తో పిచ్చి ఎక్కి మనసంతా
అతడే వాలిపోయె నీ చెంత
నను కొద్దికొద్దిగా గుట్టుగుట్టుగా
చంపుతుంటే ఇంకెట్టా
తొలి వలపు తాకి నా దేహం
అంతా మెరిసెపోయెనే పిల్లా
నా శ్వాస నీవుగా నీవే నేనుగా
తోడులేనిదే బ్రతికేదెల్లా
హే సోనా వెన్నెల సోనా నిను చేరగా రానా
నీ సొగసే కవితై కీర్తనలే నే పాడే వేళ
ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసెయ్‌నా
స్త్రీలంటే నీకొక అలర్జీ కాదా
ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కాదా
నన్ను ఏదో చేసేసిందంట
Come on baby, Don't do this baby
లవ్లీ బాణం కొట్టేసిందంట
లవ్లీగా నన్ను పట్టేసిందంట

Movie   :  Cheli
Lyrics   :  Bhuvanachandra
Music   :  Haris Jayaraj
Singers :  Harish Raghavendra, Timmy

Konte Chooputho Song Lyrics Ananthapuram 1980(2009)

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది

పగలే రేయైనా యుగమే క్షణమైనా కాలం నీ తోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటమిది
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచినే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కంటి చూపుతో నీ కంటి చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే

Movie   :  Ananthapuram  1980
Lyrics   :  Vennelakanti
Music   :  James Vasanthan
Singers:  Belly Raja, Deepa

Chinnadana Nee Kosam Song Lyrics Chinnadana Nee Kosam(2014)

ఓ... బుగ్గ గిల్లి బుగ్గా గిల్లీ
వెళ్ళిపోకే బుజ్జీ తల్లీ
మన కథ షురూ కానివ్వే ఓ...హో...
కళ్ళు నిన్ను చూసేసాయే..
నవ్వు నీది నచ్చేసిందే..
నీకోసం ప్రాణం పెట్టైనా...
అరె చిన్నాదానా నీకోసం
ఆ.. చిన్నాదానా...
చిన్నాదానా.. నీకోసం
అరె చిన్నాదానా.. నీకోసం
ఓయ్.. చిన్నాదానా...
చిన్నాదానా... నీకోసం
హో.... బొండు మల్లీ బొండూ మల్లీ
జారిపోకే గుండే గిల్లీ
ఇకపై అన్నీ నువ్వేనే..
హో...ఓ.. కొత్త కొత్త కోరిక నువ్వే
కొత్త ఆవకాయా నువ్వే
కొత్త పాట నేనే పాడైనా
అరె చిన్నాదానా.. నీకోసం
ఓయ్.. చిన్నాదానా..
చిన్నాదానా.. నీకోసం
అరె చిన్నాదానా.. నీకోసం
ఓయ్.. చిన్నాదానా..
చిన్నాదానా.. నీకోసం
ఓ....ఓహో....ఓ....ఓ...
ఓ...ఓ...ఓ....
అరెరే అమ్మాయో నడుమే సన్నాయో
నిన్ను చూసి కొట్టూకుంది నాడీ....
తియ్యనీ పాపిడీ.. పుల్లనీ మామిడీ..
ఏ దేశం పిల్లా నువ్వే సొల్లుడీ..
ఓ.. సింగారీ సింగారీ
రావే చేద్దాం సవారీ
నువ్వు ఎత్తు పల్లం అన్నీ
ఉన్న కన్యాకుమారీ..
తవ్వేస్తా నీకే బల్లారీ...
అరె చిన్నాదానా నీకోసం
ఓయ్.. చిన్నాదానా..
చిన్నాదానా.. నీకోసం
అరె చిన్నాదానా.. నీకోసం
ఓయ్.. చిన్నాదానా..
చిన్నాదానా.. నీకోసం
ఓ...ఓ...ఓ....
బుగ్గపై చుక్కనే దిష్టికే పెట్టనా
నువ్వేసే లంగాపైనే వోణీ...
గుండెలో రైలింజన్ కూ అంటూ కూసిందే
సిగ్నలే ఇచ్చే గిన్నేకోడీ
గుంటూరో నెల్లూరో
వెళ్దాం రావే ఎలూరో
పిల్లా పట్టాలిక ఎక్కేసాక నువ్వే నా జోడీ...
నీకోసం అవుతానే మోడీ....
అరె చిన్నాదానా.. నీకోసం
ఓయ్.. చిన్నాదానా..
చిన్నాదానా.. నీకోసం
అరె చిన్నాదానా.. నీకోసం
ఓయ్.. చిన్నాదానా..
చిన్నాదానా.. నీకోసం

Movie   :  Chinnadan Neekosam
Lyrics   :  Krishna Chaitanya
Music   :  Anup Rubens
Singer  :  Raja Hasan

Chal Chalo Chalo Song Lyrics S/O Satyamurthy(2015)

రాజ్యం గెలిసినోడు రాజవుతాడు..
రాజ్యం ఇడిసినోడే  రామసంద్రుడు
యుద్ధం గెలిసేటోడు  వీరుడు శూరుడు
యుద్ధం ఇడిసేటోడే దేవుడు

ఛల్ ఛలో ఛలో...

లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్  జస్ట్ సే  హలో...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్  ఫేస్ చేయరో...

తీపితో పాటుగా ఓ.. కొత్త చేదు

అందించడం జిందగీకీ  అలవాటే...
కష్టమే రాదనే  గారెంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకొ హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని

ఛల్ ఛలో ఛలో...

లైఫ్ సే మిలో..
ఇదో కొత్త  చాప్టర్ జస్ట్ సే  హలో...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేసు చేయరో...

కన్నీలెందుకు ఉప్పగుంటాయ్..

తీయగుంటె కడదాకా వదలవు గనక...
కష్టాలెందుకు బరువుగుంటాయ్..
తేలికైతే  బ్రతుకంత మోస్తూ దించవ్ గనక..
ఎదురే లేని నీకు కాక ...
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దామంటు నీ తడాక
వచ్చింది ఈ బండి నువ్వున్న ఇంటి గడప దాకా
పడ్డ వాడే కష్టపడ్డ వాడే
పైకి లేచే ప్రతోడు ఒక్కడైన కానరాడే
జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు

ఛల్ ఛలో ఛలో...

లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్  జస్ట్ సే హలో ...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేసు చేయరో...

మడతే నలగని షర్ట్ లాగా...

అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు
గీతే తగలని కాగితంలా...
ఉట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు
పుడుతూనే గుక్క పెట్టినాకా...
కష్టమన్న మాటేమి కొత్తేం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోకా...
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు
ప్లస్సు  కాదు మైనస్సు  కాదు
అనుభవాలే ఏదైనా...
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ
సాగిపోరా నీదైనా గెలుపు దారిలోనా..

ఛల్ ఛలో ఛలో...

లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో ...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేసు చేయరో...

Movie   :  S/O Satyamurthy
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Devi Sri Prasad
Singer  :  Rahul Dixit

Eduta Nilichindi Choodu Song Lyrics Vaana(2008)

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ

ఎదుట నిలిచింది చూడు
నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు
నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు

Movie  :  Vaana
Lyrics  :  Sirivennela
Music  :  Kamalakar
Singer :  Karthik

Kurise Kurise Song Lyrics Vaishali(2011)

కనులే కనులే ఏదో తెలిపే ఇది ప్రేమనుకోనా 
తడిసే తడిసే మనసే తడిసే 
లేరే లేరే ఎవరూ నాకు ఒంటరినే నేను 
ఇకపై ఇకపై అన్నీ నువ్వే... 

కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా 
ఎదనే ఎదనే తడిపిన వాన 
రగిలే రగిలే మనసే రగిలే జ్వర మొచ్చిందేమో 
తడిసి తడిసి ప్రేమలోనే 

కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా 
ఎదనే ఎదనే తడిపిన వాన 
ఓ..రగిలే రగిలే మనసే రగిలే జ్వర మొచ్చిందేమో 
తడిసి తడిసి ప్రేమలోనే.. 

మునుపే నేనే ఒక దీవై ఉన్నానే 
సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే 
మునుపే నేనే ఒక దీవై ఉన్నానే 
సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే... 
మౌనంగా మౌనంగా అన్నా 
వెళిపోతూ వెళిపోతూ ఉన్నా.. సే..సే..కురిసే.. 

నీ ఓణీ తగిలిందా ఒక జల్లే కురిసిందే 
ముసిముసి నీ నవ్వుల్లో ఓ వరదగ మారిందే 
నుదుటున కదిలే కురులే తామర బిందువువోలే 
అది సరిచేసే లోపే ముత్యాలే రాలేనే 
చాలులే చాల్లే ఇక నువ్వే వెళ్లిపో 
ఊపిరే నాదే ఆగిపోయేలాగుందే.. 

కనులే కనులే ఏదో తెలిపే ఇది ప్రేమనుకోనా 
తడిసే తడిసే మనసే తడిసే 
లేరే లేరే ఎవరూ నాకు ఒంటరినే నేను 
ఇకపై ఇకపై అన్నీ నువ్వే... 


Movie  :  Vaishali
Lyrics  :  Krishna Chaitanya
Music  :  S S Thaman
Singer :  Ranjith

Kannula Munde Sing Lyrics Sahasam Swasaga Sagipo(2016)

కన్నుల ముందే కనపడుతుందే..
కల అనుకుంటే నన్నే కొట్టిందే..
నను చూడరా అంటోందిరా..
తను ఎదకే కనువిందా..
ఈరోజే నేను మళ్లీ పుట్టాను..
నాకదే బాగుందిలే..

ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా..
నాకదే బాగుందిలే..
ఈరోజే నా ఉదయం మేలుకుంది నీతో..
నాకదే బాగుందిలే..
ఈరోజే మరీ తెలుగు కీర్తనైన నువ్వేలే..
నాకదే బాగుందిలే..
ఈరోజే చెలి వీచే గాలివై తాకితే..
నాకదే బాగుందిలే..

ఓ..కోయిల రాగంలో సంగీతం ఉందా..
పాడే పలికిందా ఓ..
ఈ కోయిల చూస్తే అయ్యయ్యయ్యో..
ఆ చూపుకి ఏమైపోతానో..
నేనైతే పడిపోయాను..
అయినా బాగుందంటాను..
ఆ చూపుకి ఏమైపోతాను..

ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా..
నాకదే బాగుందిలే..
నిన్ను చూడనట్టే చూశా..
నాకదే బాగుందిలే..
తెలుగు కీర్తనైన నువ్వేలే..
నాకదే బాగుందిలే..
మేలుకుంది నీతో..
నాకదే బాగుందిలే..
అదే..అదే..అదే..అదే..అదే..అదే..బాగుందిలే..
అదే..అదే..అదే..అదే..అదే..అదే..బాగుందిలే..
అదే..అదే..బాగుందిలే ..


Movie   :  Sahasam Swasaga Sagipo
Lyrics   :  Krishna Chaitanya
Music   :  A R Rahman
Singers:  Haricharan, Chinmayi

Ye Chilipi Kallalona Kalavo Song Lyrics Gharshana(2004)

ఏ చిలిపి కళ్ళలోన కలవో..
ఏ చిగురు గుండెలోన లయవో..
ఏ చిలిపి కళ్ళలోన కలవో..
ఏ చిగురు గుండెలోన లయవో..

నువ్వు అచ్చుల్లోనా హల్లువో..
జడకుచ్చుల్లోనా మల్లెవో ..
నువ్వు అచ్చుల్లోనా హల్లువో..
జడకుచ్చుల్లోనా మల్లెవో ..
కరిమబ్బుల్లోనా విల్లువో ..
మధుమాసం లోనా మంచు పూల జల్లువో..
మధుమాసం లోనా మంచు పూల జల్లువో..

ఏ చిలిపి కళ్ళలోన కలవో..
ఏ చిగురు గుండెలోన లయవో..

ఈ పరిమళము నీదేనా..
నాలో పరవశము నిజమేనా..
బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు..
రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు..
సొగసుని చూసి పాడగా ఎలా..
కనులకు మాట రాదుగా హలా.. 
వింతల్లొను కొత్త వింత నువ్వేనా..
ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే.. 

ఏ చిలిపి కళ్ళలోన కలవో..
ఏ చిగురు గుండెలోన లయవో..
ఏ చిలిపి కళ్ళలోన కలవో..
ఏ చిగురు గుండెలోన హ్మ్ హ్మ్ హ్మ్ ...

ఆ పరుగులలో పరవళ్ళు..
తూలే కులుకులలో కొడవళ్ళు..
నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం..
ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం..
స్వరమున గీతి కోయిలా ఇలా..
పరుగులు తీయకే అలా..అలా..
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం..
నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం..

ఏ చిలిపి కళ్ళలోన కలవో..
ఏ చిగురు గుండెలోన లయవో..
నువ్వు అచ్చుల్లోనా హల్లువో..
జడకుచ్చుల్లోనా మల్లెవో ..
నువ్వు అచ్చుల్లోనా హల్లువో..
జడకుచ్చుల్లోనా మల్లెవో ..
కరిమబ్బుల్లోనా విల్లువో ..
మధుమాసం లోనా మంచు పూల జల్లువో..
మధుమాసం లోనా మంచు పూల జల్లువో..
మధుమాసం లోనా మంచు పూల జల్లువో..పూల జల్లువో...


Movie  :  Gharshana
Lyrics  :  Kulasekhar
Music  :  Haris Jayaraj
Singer :  Srinivas

Mamatala Thalli Song Lyrics Bahubali(2015)

మమతల తల్లి..ఒడి బాహుబలి..
లాలన తేలి..శతధావరలి.. 
ఎదలో ఒక పాల్కడలి..
మథనమ్ జరిగే స్ధలి .. 

మాహిష్మతి వరక్షాత్రకులి..
జిత శాత్రవ బాహుబలి..
సాహస విక్రమ ధీశాలి..
రణతంత్ర కళాకుశలి..
ఎదలో ఒక పాల్కడలి..
మథనమ్ జరిగే స్ధలి ..

లేచిందా ఖండించే ఖడ్గం..
దూసిందా ఛేదించే బాణమ్..
చెదరంది ఆ దృఢసంకల్పం..
తానే ..సేనై .. తోచే ..

తల్లే తన గురువు దైవం..
భల్లా తోనే సహవాసం ..
ధ్యేయం అందరి సంక్షేమం..
రాజ్యం .. రాజు .. తానే ఒ.ఓ...

శాసన సమం..
శివగామి వచనం..
సదసద్రణరంగం ఇరణమ్..
జననీ హృదయం..

ఎదలో ఒక పాల్కడలి..
మథనమ్ జరిగే స్ధలి ..


Movie  :  Bahubali
Lyrics  :  K Shiva Shakthi Datta
Music  :  M M Keeravani
Singer :  Satya Yamini

Manohara Na Hrudayamune Song Lyrics Cheli(2001)

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా
శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి
నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట ఓ ప్రేమా ప్రేమా…..
సందె వేళ స్నానం చేసి నన్ను చేరి
నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక
వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం
నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
ఓసారి ప్రియమరా ఒడిచేర్చుకోవా నీ చెలిని
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల


Movie   :  Cheli
Lyrics   :  Bhuvana Chandra
Music   :  Haris Jayaraj
Singer  :  Bombay Jayashree