Vintunnavaa Song Lyrics Ye Maya Chesave(2010)

పలుకులు నీ పేరే తలుచుకున్నా.. 
పెదవుల అంచుల్లో అణుచుకున్నా.. 
మౌనముతో నీ మదిని బంధించా.. 
మన్నించు ప్రియా.. 

తరిమే వరమా..తడిమే స్వరమా.. 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా.. 
వింటున్నావా..వింటున్నావా..వింటున్నావా...
తరిమే వరమా..తడిమే స్వరమా.. 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా.. 
వింటున్నావా..వింటున్నావా..వింటున్నావా..
వింటున్నావా..వింటున్నావా.. 

విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా..
తొలి సారి నీ మాటల్లో.. 
పులకింతల పదనిసలు విన్నా.. 
చాలు చాలే చెలియా చెలియా.. 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా.. 
ఓ..బతికుండగా నీ పిలుపులు నేను విన్నా..

ఏమో ఏమో ఏమవుతుందో... 
ఏదేమైనా నువ్వే చూసుకో... 
విడువను నిన్నే ఇకపైన.వింటున్నావా..ప్రియా.. 
గాలిలో తెల్ల కాగితంలా.. 
నేనలా తేలి ఆడుతుంటే. .
నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా.. 

తరిమే వరమా..తడిమే స్వరమా.. 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా..వింటున్నావా..వింటున్నావా.. 
వింటున్నావా..వింటున్నావా.. 

ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి.. 
ఆద్యంతం ఏదో అనుభూతి.. 
అనవరతం ఇలా అందించేది.. 
గగనం కన్నా మునుపటిది.. 
భూతలమ్ కన్నా ఇది వెనుకటిది.. 
కాలంతోన పుట్టింది కాలం లా మారే ..
మనసే లేనిది ప్రేమ.. 

రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా.. 
నీ దానినై నిన్నే దారిచేసుకుంటా.. 
ఎవరిని కలువని చోటులలోన.. 
ఎవరిని తలువని వేళలలోన.. 
తరిమే వరమా..తడిమే స్వరమా.. 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా..
వింటున్నావా..వింటున్నావా..వింటున్నావా..
వింటున్నావా..వింటున్నావా.. 

విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా..
తొలి సారి నీ మాటల్లో.. 
పులకింతల పదనిసలు విన్నా.. 
చాలు చాలే చెలియా చెలియా.. 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా.. 
చాలు చాలే చెలియా చెలియా.. 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా..
ఓ..బతికుండగా నీ పిలుపులు నేను విన్నా..


Movie   :  Ye Maya Chesave
Lyrics   :  Anantha Sriram
Music   :  A R Rahman
Singers:  Karthik, Shreya Ghoshal

Paccha Bottesina Song Lyrics Bahubali(2015)

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో 
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా 
జంటకట్టేసిన తుంటరోడ నీతో 
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా 
వేయి జన్మాల ఆరాటమై 
వేచి ఉన్నానే నీ ముందర 
చేయి నీ చేతిలో చేరగా 
రెక్క విప్పిందే నా తొందర... 

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో 
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా... 

మాయగా నీ సోయగాలాలు వేసి 
నన్నిలా లాగింది నువ్వే హలా 
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా 
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా 
బాహు బంధాల పొత్తిళ్లలో...విచ్చుకున్నావే ఓ మల్లిక... 
కోడె కౌగిళ్ల ఒత్తిళ్లలో...పురి విప్పింది నా కోరిక... 

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో 
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా... 

కానలో నువు నేను ఒకమేను కాగా 
కోనలో ప్రతి కొమ్మ మురి సేనుగా 
మరుక్షణమే ఎదుర్తెనా మరణము కూడా పరవశమే 
సాంతం నేనీ సొంతము అయ్యాకా 
చెమ్మ చేరేటి చెక్కిళ్లలో...చిందులేసింది సిరివెన్నెల... 
ప్రేమ ఉరేటి నీ కళ్లలో...రేయి కరిగింది తెలిమంచులా... 

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో 
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా 
జంటకట్టేసిన తుంటరోడ నీతో 
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా 

Movie   :  Bahubali
Lyrics   :  Anantha Sriram
Music   :  Keeravani
Singers :  Karthik, Damini

Kanulanu Thake Song Lyrics Manam(2014)

టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి

ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
నీ నవ్వులే నేడిలా
ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా..
నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా
ఓ కనులను తాకే ఓ కలా... ఓ...

హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగ నాతో సాగేనా..
నాలో రేగింది ఓ గాయమే..
దారే చూపేన ఈ కాలమే యేయేయేయే..
నువ్వే నేనా నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెలోనా..
నీతో లేనా ఆహా..
ఓ కనులను తాకె ఓ కలా... ఓ.. ఓ.. ఓ..

చంద ఓ చందమామ రావా
మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
వాన ఓ వెన్నెల వాన రావా
నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి

ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా..
ఇంక ఈ జీవితం ఎందుకో..
కంట కన్నీరు నింపేందుకో.. ఓ ఓ ఓ ఓ..
నీతో రానా నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా..
నీలో లేనా ఆహా..


Movie   :  Manam
Lyrics   :  Vanamali
Music   :  Anup Rubens
Singer  :  Arjith Singh

Bapu Gari Bommo Song Lyrics Attarintiki Daredi(2013)

హేయ్ బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది..
ఉంగరాలున్న జుట్టు తిప్పింది..
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ...
అమ్మో బాపు గారి బొమ్మో..
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...
రబ్బరు గాజుల రంగు తీసింది..
బుగ్గల అంచున ఎరుపు రాసింది..
రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ...
అమ్మో దాని చూపు గమ్మో..
ఓలమ్మో ఓల్డ్ మోంక్ రమ్మో... హై...
పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా..
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది..
ఏకంగా యెదపైనే నర్తించిందీ...
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది...
అమ్మో బాపు గారి బొమ్మో హే..హే..హే...
ఓలమ్మో మల్లెపూల కొమ్మో..హో హో..

మొన్న మేడ మీద బట్టలారేస్తూ..
కూని రాగమేదొ తీసేస్తూ..
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా...
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ..
నాజూకైన వేళ్ళు తాకిస్తూ..
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా... హోయ్..
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది..
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది..
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది..
చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది..
పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ..
పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ..
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ....
అమ్మో బాపు గారి బొమ్మో హే..హే..హే..
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...

సయ్యో అయ్యయ్యో..మయ్యో అయ్యయ్యో..
రయ్యో అయ్యయ్యో..అహ..అహ..అహ..అహ..
సయ్యో అయ్యయ్యో..మయ్యో అయ్యయ్యో..
రయ్యో అయ్యయ్యో..అహ..అహ..అహ..అహ..

యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది..
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ..
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది..
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది..
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది..
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది..
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది..
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది..
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి..
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ..
అమ్మో బాపు గారి బొమ్మో హే..హే..హే..
ఓలమ్మో మల్లెపూల కొమ్మో... ఓ..


Movie   :  Attarintiki Daredi
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Devi Sri Prasad
Singer  :  Shankar Mahadevan

Kita Kita Thalupulu Song Lyrics Manasantha Nuvve(2001)

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా..
ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. 
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..

నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక..
కమ్మని కలలో అయినా నిను చూడలేదే..
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా..
రెప్పపాటైనా లేక చూడాలనుందే..
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా..
కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా..
ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. 
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..

కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు..
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా..
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి..
అమృతం అయిపోలేదా ఆవేదనంతా..
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా..
ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా..
ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా..
ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. 
ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. 
ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. 


Movie   :  Manasantha Nuvve
Lyrics   :  Sirivennela
Music   :  R P Patnaik
Singer  :  Usha

Yedhi Yedhi Song Lyrics Yeto Vellipoindi Manusu(2012)

ఏది ఏది కుదురేది ఏది..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో..

ఏది ఏది కుదురేది ఏది ఎదలో...
ఏది ఏది అదుపేది ఏది మదిలో..
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక..
పెదవే పేదై నీదై ఉంటే ..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...

నే ఓడే ఆట నీ వాదం అంటా ఎంతో ఇష్టంగా..
నే పాడే పాట నీ పెరేనంటా చాలా కాలంగా..
నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస..
ఊహ ఊసు నీతోనే నింపేసా...
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే..
కలలే కళ్ళైచూస్తూ ఉంటే...
ఏది ఏది కుదురేది ఏది ఎదలో..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...

నా కాలం నీదే నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్లౌతున్నా..
నీ పాఠం నేనే నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా ..
నాలోకం నిండా నీ నవ్వే నాలోను నిండా నువ్వే..
తీరం దారి దూరం నువ్వయ్యవే..
నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే..
మనలో నువ్వు నేను ఉంటే...
ఏది ఏది కుదురేది ఏది ఎదలో...
ఏది ఏది అదుపేది ఏది మదిలో...
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక..
పెదవే పేదై నీదై ఉంటే ..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...


Movie    :  Yeto Vellipoindi Manusu
Lyrics    :  Anantha Sriram
Music    :  Ilayaraja
Singers :  Ramya NSK, Shaan)

Desam Manade Song Lyrics Jai(2004)

నాననినాన నాననినాన..
నాన నాన నననా నానా.. 

దేశం మనదే తేజం మనదే..
దేశం మనదే తేజం మనదే.. 
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే.. 
ప్రజల అండదండా మనదే..

అందాల బంధం ఉంది ఈ నేలలో.. 
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో.. 
ఏ కులమైనా ఏ మతమైనా.. 
ఏ కులమైనా ఏ మతమైనా.. 
భరతమాతకొకటేలేరా.. 
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా.. 
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా.. 
వందేమాతరం అందామందరం.. 
వందేమాతరం ఓ… అందామందరం..

దేశం మనదే తేజం మనదే..
దేశం మనదే తేజం మనదే.. 
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే.. 
ప్రజల అండదండా మనదే..

అందాల బంధం ఉంది ఈ నేలలో..
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో..
ఏ కులమైన ఏ మతమైన..
భరతమాతకొకటేలేరా..
రాజులు అయినా పేదలు అయినా..
భరతమాత సుతులేలేరా..

ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా..
దేశమంటే ప్రాణమిస్తాం..
అంతా ఈవేళా..
వందేమాతరం అందామందరం..
వందేమాతరం ఓ… అందామందరం..


Movie   :  Jai
Lyrics   :  Kulasekhar
Music   :  Anup Rubens
Singers:  Baby Pretty, Srinivas

Naa Cheli Rojave Song Lyrics Roja(1992)

నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే..
నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే..
కళ్ళల్లో నీవే కన్నీట నీవే..
కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..
కనిపించవో అందించవో తోడు..

నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే...

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం..
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం..
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం..
మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం..
మనసు లేకపోతే మనిషి ఎందుకంట..
నీవు లేకపోతే బతుకు దండగంట..
కనిపించవో అందించవో తోడు..

నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే..
కళ్ళల్లో నీవే కన్నీట నీవే..
కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..
కనిపించవో అందించవో తోడు..

చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో..
మమత దూరమాయెనే చందమామ దాగిపో..
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో..
తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో..
మనసులోని మాట ఆలకించలేవా..
వీడిపోని నీడై నిన్ను చేరనీవా..
కనిపించవో అందించవో తోడు..

నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే..
కళ్ళల్లో నీవే కన్నీట నీవే..
కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..
కనిపించవో అందించవో తోడు..


Movie   :  Roja
Lyrics   :  Rajashri
Music   :  A R Rahman
Singers:  S P Balu, Sujatha

Chilipiga Chusthavala Song Lyrics Orange(2002)

చిలిపిగా చూస్తావ్ అలా.. 
పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా...
చివరికి నువ్వే అలా… 
వేస్తావే వల.. నీతో వేగేదెలా...
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది.. ఆపై చేదెక్కుతోందిలా ..
కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా ..

చిలిపిగా చూస్తావ్ అలా.. 
పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా...
చివరికి నువ్వే అలా… 
వేస్తావే వల.. నీతో వేగేదెలా..

నిన్నే ఇలా.. చేరగా .. 
మాటే మార్చి మాయే చేయ్యాలా...
నన్నే ఇక.. నన్నుగా.. ప్రేమించని ప్రేమేలా..
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీసంకెల...

కొంచం మధురము కొంచం విరహము 
వింతలో నువ్వు నరకం ..
కొంచం స్వర్గము కొంచం శాంతము 
గొంతులో చాలు గరళం ..
కొంచం పరువము కొంచం ప్రణయము 
గుండెనే కోయు గాయం ..
కొంచం మౌనము కొంచం గానము 
ఎందుకీ ఇంద్రజాలం ..

ఇన్నాళ్ళుగా.. సాగినా .. 
ప్రేమ నుంచి..వేరై పోతున్నా ..
మళ్లీ.. మరో గుండెతో .. 
స్నేహం కోరి.. వెళుతున్నా ..
ప్రేమనే.. దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం.. ఆ సంతోషం.. నాతొ పాటు సాగేదెలా ఎలా ..

చిలిపిగా చూస్తావ్ అలా.. 
పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా...
చివరికి నువ్వే అలా… 
వేస్తావే వల .. నీతో వేగేదెలా...
ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది .. ఆపై చేదెక్కుతోందిలా ..
కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా ..

కొంచం మధురము కొంచం విరహము 
వింతలో నువ్వు నరకం ..
కొంచం పరువము కొంచం ప్రణయము 
గుండెనే కోయు గాయం ..
కొంచం మధురము కొంచం విరహము...
కొంచం పరువము కొంచం ప్రణయము.....



Movie   :  Orange
Lyrics   :  Vanamali
Music   :  Haris Jayaraj
Singer  :  Karthik

Manasantha Nuvve Song Lyrics Manasantha Nuvve(2001)

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. 
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా..
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా..
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా..
మనసంతా నువ్వే..మనసంతా నువ్వే..
మనసంతా నువ్వే..నా మనసంతా నువ్వే..

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి..
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది..
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి..
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది..
ఎపుడో ఒకనాటి నిన్నని ..
వెతికానని ఎవరు నవ్వనీ..
ఇపుడు నిను చూపగలనని ..
ఇదుగో నా నీడ నువ్వని..
నేస్తమా నీకు తెలిసేదెలా..

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా..
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా..
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా..
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా..

ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని..
గుండెలో ఊసులే నీకు చెప్పాలని..
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని..
గుండెలో ఊసులే నీకు చెప్పాలని..
నీ తలపులు చినుకు చినుకుగా ...
దాచిన బరువెంత పెరిగెనో..
నిను చేరే వరకు ఎక్కడా ..
కరిగించను కంటి నీరుగా..
స్నేహమా నీకు తెలిపేదెలా..

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా..
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా..
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా..
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా..
మనసంతా నువ్వే..మనసంతా నువ్వే..
మనసంతా నువ్వే..నా మనసంతా నువ్వే..


Movie    :  Manasantha Nuvve
Lyrics    :  Sirivennela
Music    :  R P Ptanik, 
Singers  :  R P Patnaik, Usha