Nidare Kala Ayinadi Song Lyrics Surya S/O Krishnan(2008)

నిదరే కల అయినది..కలయే నిజమైనది..
బతకే జత అయినది..జతయే అతనన్నది..
మనసేమో ఆగదు..క్షణమైనా తోచదు..
మొదలాయే కథే ఇలా.. 

నిదరే కల అయినది..కలయే నిజమైనది..
బతకే జత అయినది..జతయే అతనన్నది..
మనసేమో ఆగదు..క్షణమైనా తోచదు..
మొదలాయే కథే ఇలా.. 

వయసంతా వసంత గాలి మనసనుకో..మమతనుకో..
ఎదురైనది ఎడారి దారి చిగురులతో..చిలకలతో..
యమునకొకే సంగమమే కడలినది..కలవదులే..
హృదయమిలా అంకితమై నిలిచినది తనకొరకే
పడిన ముడి పడచు ఒడి ఎదలో చిరు మువ్వల సవ్వడి...

నిదరే కల అయినది..కలయే నిజమైనది..
బతకే జత అయినది..జతయే అతనన్నది..
మనసేమో ఆగదు..క్షణమైనా తోచదు..
మొదలాయే కథే ఇలా..

అభిమానం అనేది మౌనం పెదవులపై పలుకదులే..
అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే ..
నిను కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి..
నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలి..
ఎదుట పడి కుదుట పడే మమకారపు నివాళిలేఇది...

నిదరే కల అయినది..కలయే నిజమైనది..
బతకే జత అయినది..జతయే అతనన్నది..
మనసేమో ఆగదు..క్షణమైనా తోచదు..
మొదలాయే కథే ఇలా.. 


Movie    :  Surya S/O Krishnan
Lyrics    :  Veturi
Music    :  Haris Jayaraj
Singers  :  Sudha, Raghunath

Chandrulo Unde Song Lyrics Nuvvostanante Nenoddantana(2005)

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట
నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా

గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో

కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం బాటచూపగా
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా లేని పోని దుందురుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవా

Movie   :  Nuvvostanante Nenoddantana
Lyrics   :  Sirivennela
Music   :  Devi Sri Prasad
Singers :  Shankar Mahadevan, Devi Sri Prasad

O Navvu Chalu Song Lyrics Nuvvu Naaku Nachav(2001)

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితె చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తూంటే పూవుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం
గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

Movie   :  Nuvvu Naaku Nachav
Lyrics   :  Sirivennela
Music   :  Koti
Singer  :  Shankar Mahadevan

Mounamgane Song Lyrics Naa Autograph (2004)

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకుంటె సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

Movie   :  Naa Autograph
Lyrics   :  Chandrabose
Music   :  M M Keeravani
Singer  :  Chitra

Enthavaraku Song Lyrics Gamyam(2007)

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

కనపడేవెన్నెన్ని కెరటాలు
కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే
బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టుక చావు రెండే రెండూ నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానియ్యి


Movie   :  Gamyam
Lyrics   :  Sirivennela
Music   :  E.S.Murthy, R Anil
Singer  :  Ranjith

Srirasthu Subhamastu Song Lyrics Pelli Pustakam(1991)

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికినింపుకో
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

Movie   :  Pelli Pustakam
Lyrics   :  Arudra
Music   :  K V Mahadevan
Singers:  S P Balu, P Susheela

You and I Song Lyrics Jalsa(2008)

యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాట అనుకో తమాషగా తల ఊపి
Varietyగ శబ్దం విందాం అర్ధం కొద్దిగ side కి జరిపి
అదే మనం తెలుగులొ అంటే dont worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle


ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైనా అమృతం
కష్టం కూడ అద్భుతం కాదా
Botanicalభాషలో petals పూరేకులు
Material science లో కలలు మెదడు పెనుకేకలు
Mechanicalశ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle


పొందాలంటే victory పోరాటం compulsory
Risk అంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే historyలిఖ్ నా
Utopia ఊహలో అటో ఇటో సాగుదాం
Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophyచూపులో ప్రపంచమో బూటకం
Anatomy labలో మనకు మనం దొరకం
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle

Movie   :  Jalsa
Lyrics   :  Sirivennela
Music   :  Devi Sri Prasad
Singer   :  Devi Sri Prasad

Chalore Chalore Chal Song Lyrics Jalsa(2008)

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

Movie  :  Jalsa
Lyrics  :  Sirivennela
Music  :  Devi Sri Prasad
Singer :  Ranjith

Alanaati Song Lyrics Murari(2001)

అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెనుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందామామ చందామామ కిందికి చూడమ్మా
ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెలబోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళకళ జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షతలేయండి

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకుని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడుగక బంధువులంతా కదలండి

Movie   :  Murari
Lyrics   :  Sirivennela
Music   :  Manisharma
Singers :  Jikki, Sandhya, Sunitha

Evvare Nuvvu Song Lyrics Raju Bhai(2007)

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు


ఎటు చూసినా ఏంచేసినా ఏదారిలో అడుగేసినా
నలువైపులా నా ఎదురే ఉందామైనా ఆమైనా
ఏ మబ్బులో దోగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతోందిగా

చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బ్రతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే

Movie   :  Raju Bhai
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Yuvan Shankar Raja
Singer  :  Harish Raghavendra